V1News Telangana

best news portal development company in india

ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు….

SHARE:

– తెలంగాణ తిరుమల దేవస్థానంలో ప్రత్యేక పూజలు, అభిషేకం, అర్చన కార్యక్రమాలు నిర్వహణ

– ఆలయ ప్రాంగణంలో వృక్షార్చన, కేక్ కటింగ్ నిర్వహించిన నాయకులు

– మైలారం గ్రామంలో అన్నదానం ఏర్పాటు

– నసురుల్లాబాద్ మండల కేంద్రంలో అంగన్వాడి పిల్లలకు మిఠాయిలు, పళ్ళు పంపిణీ

– బాన్సువాడ లో రక్తదాన శిబిరం, వృక్షార్చన, ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పళ్ళు, మిఠాయిలు పంపిణీ

– మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్

కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బిఆర్ఎస్ పార్టీ రథసారథి, మాజీ ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం రోజు బాన్సువాడ నియోజకవర్గ వ్యాప్తంగా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో బాన్సువాడ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ ఆధ్వర్యంలో ముందుగా బీర్కూర్ మండలంలోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో కెసిఆర్ పేరు మీద ప్రత్యేక పూజలు, అభిషేకం, అర్చన కార్యక్రమం నిర్వహించారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో వృక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం నసురుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని కేక్ కటింగ్ చేసి అన్నదానం నిర్వహించినందుకు మైలారం గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులను అభినందించారు. అనంతరం నసురుల్లాబాద్ మండల కేంద్రంలో కేక్ కటింగ్ చేసి ఒకరికొకరు పరస్పరం మిఠాయిలు పంచుకొని సంతోషంగా బాణాసంచా పేల్చి సందడిగా నిర్వహించారు. తర్వాత అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు మిఠాయిలు, పళ్ళు పంపిణీ చేశారు.అనంతరం బాన్సువాడ పట్టణ కేంద్రంలో గల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ చేసి, రక్తదాన శిబిరం, వృక్షార్చన కార్యక్రమాలు వాటితోపాటు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి పళ్ళు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షేక్ జుబేర్ మాట్లాడుతూ కెసిఆర్ పై అభిమానంతో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ శ్రేణులు అందరిని అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి, ప్రజలకు అన్ని రకాల సంక్షేమ పథకాలను అమలు అయ్యేలా చేసి తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన గొప్ప నాయకుడని కొనియాడారు. కెసిఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం అన్ని రంగాలలో బాగుపడిందని.. ప్రజలందరూ మళ్లీ కెసిఆర్ ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోచి గణేష్, రమేష్ యాదవ్, అఫ్రోజ్, గొడిసెల నరసింహులు గౌడ్, టేకుర్ల సాయిలు, వెంకటి, చుంచు శేఖర్, మోసిన్, దేశ్ పాక్ సాయిలు, గంపల శంకర్, అల్లం రాములు, శ్రీనివాస్ గౌడ్, కనుకుంట్ల శ్రీనివాస్, ధార వెంకటి, అక్త్యార్, సాయిలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india