– ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయానికి పాటించవలసిన జాగ్రత్తలపై మండల అధ్యక్షులకు దిశానిర్దేశం
– పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ అంజిరెడ్డి
– ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య
– గెలుపు కొరకు కష్టపడి పని చేయాలని సూచనలు
కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: మరి కొద్ది రోజులలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా సోమవారం రోజు కరీంనగర్ లో గల మైత్రి రెసిడెన్సిలో ఎమ్మెల్సీ ఎన్నికల లో అవలంబించాల్సిన కార్యాచరణ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి ఆయా జిల్లాల, నియోజకవర్గాల వారీగా మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ , నిజామాబాద్,అదిలాబాద్, మెదక్ , నియోజకవర్గాల పరిధిలో భారతీయ జనతా పార్టీ బలపరచిన అభ్యర్థులు అంజిరెడ్డి(పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి) మరియు మల్క కొమురయ్య(ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్ధి) భారీ మెజార్టీతో గెలిపించడం కొరకు క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన భవిష్యత్తు కార్యాచరణను బిజెపి మండల అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే, బిజెపి శాసనసభాపక్ష ఉపనేత కాటిపల్లి వెంకట రమణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్.వీ.ఎస్.ఎస్ ప్రభాకర్,బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు,MLC జిల్లా ప్రభారీ పెద్దోళ్ల గంగారెడ్డి,బాన్సువాడ నియోజకవర్గం కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, బాన్సువాడ నియోజకవర్గం ఉపాధ్యాయ MLC ఇంచార్జ్ బొప్పిడి మోహన్ రెడ్డి, నసురుల్లాబాద్ మండల అధ్యక్షులు సున్నం సాయిలు, రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రకాష్ పటేల్, బాన్సువాడ పట్టణ అధ్యక్షులు తుప్తి శివప్రసాద్, శంకర్, విట్టల్, మజ్జిగ శ్రీనివాస్, యోగి తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








