Post Views: 101
– మానవతా దృక్పథంతో చేయూత అందించిన బిజెపి నాయకులు
– NRI కోనేరు శశాంక్
రుద్రూర్ ప్రతినిధి:
నిజామాబాద్ జిల్లా: రుద్రూర్ మండలంలోని రాయికూర్ గ్రామానికి చెందిన నిరుపేద షేక్ ఇస్మాయిల్ కూతురు సనా బేగం వివాహం గురించి వారి ఆర్థిక పరిస్థితి బాగాలేదని తెలుసుకొని మానవత్వంతో వెంటనే స్పందించి కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బిజెపి నాయకులు,NRI కోనేరు శశాంక్ రూ.5000 ఆర్థిక సహాయం బిజెపి రుద్రూర్ మండల కమిటీ నాయకుల చేతుల మీదుగా ఆ కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రుద్రూర్ మండల ఉపాధ్యక్షులు బేగరి వినోద్ కుమార్, ఈశ్వర్, సాయికుమార్, పందిరి శివ, శంకర్ మరియు బిజెపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








