– తెలంగాణ రాష్ట్రంలో 32,33,642 గల మాదిగల జనాభా
– జనాభా దామాషా ప్రకారం మాదిగలకు న్యాయంగా 11 శాతం ఎస్సీ రిజర్వేషన్లు కేటాయించాలి
– మాదిగల భారీ సాంస్కృతిక ప్రదర్శన “లక్ష డప్పులు- వేల గొంతులు” జయప్రదం చేయడానికి సన్నాహకాలు
– ఫిబ్రవరి 20వ తేదీ నుండి ప్రభుత్వ ,ప్రైవేటు కళాశాలల్లో MSF కమిటీలు ఏర్పాటు చేస్తామని వెల్లడి
– మాదిగ విద్యార్థిని, విద్యార్థులు అందరూ సహకరించాలని పిలుపు
– MSF కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మెక్కా సాయి మాదిగ
కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో 32,33,642 మంది జనాభా గల మాదిగలకు ప్రభుత్వం నిర్వహించే కుల గణనలో భాగంగా జనాభా దామాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లలో 11 శాతం కేటాయించాలని MSF కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మెక్కా సాయి మాదిగ సోమవారం రోజు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని తీర్పు వెలువరించిన తర్వాత కూడా ప్రభుత్వాలు మరియు కొందరు ఉన్నత వర్గాలకు చెందిన నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కొరకు మాదిగల పట్ల అవలంబిస్తున్న తీరును ఖండిస్తూ హక్కుల సాధన కొరకు త్వరలో నిర్వహించబోయే మాదిగల భారీ సాంస్కృతిక ప్రదర్శన” లక్ష డప్పులు వేల గొంతులు”కార్యక్రమానికి మాదిగ జాతి విద్యావంతులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, యువకులు, పెద్దలు అందరూ సంకన డప్పులతో అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేసే విధంగా అందరిని సంఘటితంగా, చైతన్య పరచడానికి ఈనెల 20వ తేదీ నుండి బాన్సువాడ నియోజకవర్గం లో గల అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో MSF నూతన కమిటీలను వేయడం జరుగుతుందని తెలిపారు. మాదిగ విద్యార్థినీ, విద్యార్థులు అందరూ ఈ కార్యక్రమానికి సహకరించాలని సూచించారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








