– పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతు తెలుపుతూ ప్రచారం
– ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ అంజిరెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి
– పట్టబద్ధుల సమస్యలపై శాసనమండలిలో తమ గొంతుతో ధీటుగా పోరాడుతారని సూచనలు
– బిజెపి రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ
రుద్రూర్ ప్రతినిధి:
నిజామాబాద్ జిల్లా: రుద్రూర్ మండల కేంద్రంలో ఆదివారం రోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ అంజిరెడ్డికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ ఆధ్వర్యంలో జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థులను గెలిపించినట్లయితే శాసనమండలిలో పట్టబద్ధుల సమస్యలపై తమ గొంతుతో దీటుగా పోరాడుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. పట్టభద్రులందరూ తమ అమూల్యమైన ఓటు హక్కును మొదటి ప్రాధాన్యంగా వినియోగించుకొని భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డాక్టర్ అంజిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రశాంత్ గౌడ్, రామ్ రాజ్, పార్వతి మురళి, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








