బర్డ్ ఫ్లూ భయం!
ఆంధ్రపదేశ్ బర్డ్ ఫ్లూపై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో కోళ్ల రవాణా నిరో ధానికి అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేప ట్టారు. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న సాలూర, కంద కుర్తి వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. చెక్ పోస్టుల వద్ద పశుసంవర్ధక, పోలీసు శాఖలు కలిసి వాహనాలను తనిఖీ చేస్తున్నాయి. బయటి రాష్ట్రాల నుంచి జిల్లాలోకి కోళ్లతోపాటు ఎలాంటి జీవాలను రవాణా చేయకుండా వాహనాలను వెనక్కి పం పుతున్నారు. పశుసంవర్ధక శాఖ నుంచి ఆరుగురు సిబ్బంది చెక్ పోస్టుల వద్ద 24 గంటల పాటు విధులు నిర్వర్తిస్తున్నట్లు ఆ శాఖ జేడీ జగన్నాథచారి తెలిపారు. ఇప్పటికే జిల్లాలో పదిహేనుకు పైగా ఫారాల్లో బర్డ్ ఫ్లూ వంటి వైరస్ లక్షణాలతో సుమారు 60 వేల వరకు బ్రాయిలర్, దేశీ రకం కోళ్లు మృత్యు వాత పడ్డాయి. చనిపోయిన కోళ్ల నుంచి నమూనా లను సేకరించిన అధికారులు వారం క్రితం హైదరా బాద్ ల్యాబ్‌కు పంపించారు. ఇంత వరకు అది ఏ వైరస్ అనేది నిర్ధారణ కాలేదు. కోళ్ల ఫారాల్లో జీవ సంరక్షణ చర్యల ద్వారా కొంతవరకు వైరస్ అదుపు
• జిల్లా సరిహద్దుల మీదుగా కోళ్ల రవాణా నిరోధానికి చర్యలు•
సాలూర, కందకుర్తి వద్ద చెకోపోస్టులు ఏర్పాటు..

పొతంగల్ మండలం చేతననగర్ లోని ఫారంలో మృతి చెందిన కోళ్లు (ఫైల్)
లోకి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. మరో వైపు ఏపీలో బర్డ్ ఫ్లూ అలర్డ్ రావడంతో జిల్లాలో కూడా అదే వైరస్ తో కోళ్లు మరణించి ఉంటాయని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే వైరస్ కారణంగా కొన్ని రోజులపాటు చికెన్ తినకూ డదని ప్రభుత్వం ప్రకటించిందంటూ మంగళవారం సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇది చికెన్ సెంటర్లపై ప్రభావం చూపింది. చికెన్ అమ్మ కాలు తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








