నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో మంగళవారం రోజు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గం వ్యాప్తంగా పనిచేస్తున్న జిల్లాస్థాయి నాయకులు మరియు మండల నాయకులు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బాన్సువాడ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పార్టీ శ్రేణులందరికీ క్షేత్రస్థాయిలో నిబద్ధతతో ప్రచారం చేసి ఎమ్మెల్సీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి, పరిపాలన దక్షతకు యావత్ భారత దేశ ప్రజలు ఆకర్షితులవుతున్నారన్నారు. దీనికి నిదర్శనంగా దేశ రాజధాని ఢిల్లీలో 27 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అక్కడి ప్రజలు భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పట్టి భారీ మెజార్టీతో గెలిపించారని అన్నారు. అదే స్ఫూర్తితో రాబోయే ఎన్నికలలో కష్టపడి పనిచేసి సత్తా చాటుతామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలతో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందని ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం మరియు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగ సమస్యలను మరియు నిరుద్యోగుల సమస్యలను విస్మరించారని అన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పట్ల చట్టసభలలో ప్రశ్నలు లేవనెత్తి సాధించుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ అంజిరెడ్డి లకు అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకొని భారీ మెజార్టీతో గెలిపించాలని ఉపాధ్యాయులను మరియు పట్టభద్రులను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి చందూరి హన్మండ్లు, నసురుల్లాబాద్ మండల అధ్యక్షులు సున్నం సాయిలు, మండల ప్రధాన కార్యదర్శి మేకల రాములు యాదవ్, యాదగిరి గౌడ్, మహేష్, దుర్గం సంజీవులు, అరిగె నారాయణ, రాఘవ, మనూరు సాయిలు, ఉల్లెంగ గోపి , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








