నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా:నసురుల్లాబాద్ మండలంలోని హాజీపూర్ గ్రామంలో మత్తడి చెరువు క్రింద సాగు అవుతున్న ఆయకట్టు సుమారు 100 ఎకరాలలో వరి మొక్కజొన్న పంటలకు ఉప కాలువలో పూడిక పేరుకుపోయి సరిగ్గా నీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. పరిస్థితిని గమనించిన రైతులందరూ కలిసి దాదాపు రూ.40వేలు పోగు చేసుకొని పూడిక తీయించారు. ఉప కాలువ సీసీ నిర్మాణం గోడలు ఎత్తు తక్కువగా ఉండటం వలన ప్రతి సంవత్సరం ఈ పరిస్థితి నెలకొంటుందని రైతులు వాపోతున్నారు. ఉప కాలువ సీసీ గోడలను మూడు ఫీట్లు ఎత్తు పెంచినట్లయితే సమస్య పరిష్కారం అవుతుందని.. వ్యవసాయ శాఖ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందించి నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








