V1News Telangana

best news portal development company in india

నూతన విగ్రహ ప్రతిష్టాపనకు హాజరైన మాజీ శాసనసభ్యులు….

SHARE:

నూతన విగ్రహ ప్రతిష్టాపనకు హాజరైన మాజీ శాసనసభ్యులు….

– ఏనుగు రవీందర్ రెడ్డి

నిజామాబాద్ ప్రతినిధి:

నిజామాబాద్ జిల్లా: బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలంలోని కూనిపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా నిర్వహించిన మొదటి పూజా కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు, బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి, శ్రీ శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి మరియు పిట్ల కృష్ణ మహారాజ్ స్వామి ల తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువాలతో ఘనంగా సత్కరించారు. వేద పండితులు ఆశీర్వచనం అందించి రాజకీయాలలో గొప్పగా రాణించి, ప్రజలకు సేవలందిస్తూ.. విజయం సాధించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india