V1News Telangana

best news portal development company in india

జన హృదయ నేతకు ఘనంగా జన్మదిన వేడుకల నిర్వహణ….

SHARE:

– నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్న జన్మదిన వేడుకలు

– భారీ సంఖ్యలో హాజరైన జనం

– పలుచోట్ల రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాల ఏర్పాటు

– వారు చూపే అభిమానానికి తెలిపిన అభినందనలు

– ఆనందంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి

కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను సోమవారం రోజు బాన్సువాడ నియోజకవర్గ వ్యాప్తంగా అభిమానులు కార్యకర్తలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ మరియు మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి లతో కలిసి ఆయన జన్మదిన వేడుకల కార్యక్రమాలకు పాల్గొన్నారు. జన్మదినం సందర్భంగా తాను ముందుగా ఇష్టదైవం బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులో గల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా శాలువాతో సత్కరించి , పురోహితులు ఆశీర్వచనం అందించారు. స్వామి వారి కృప కటాక్షాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. అనంతరం వర్ని మండలం కూనిపూర్ గ్రామంలో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి మరియు పిట్ల కృష్ణ మహారాజ్ స్వామి లు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా శాలువాతో సత్కరించారు. తదుపరి వర్ని మండల కేంద్రంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఏర్పాటుచేసిన కేక్ ను కట్ చేసి .. వారు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం మరియు అన్నదాన కార్యక్రమాలలో పాల్గొన్నారు. నసురుల్లాబాద్ మండల కేంద్రంలో మాజీ ఎంపిటిసి కంది మల్లేష్ నివాసంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకకు హాజరై కేక్ కట్ చేశారు. స్థానిక నాయకులు ఆయన కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బాన్సువాడ పట్టణంలో నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, అభిమానులు ఘనంగా ఏర్పాటుచేసిన జన్మదిన వేడుకలలో భారీ కేక్ ను కట్ చేసి జరుపుకున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం అన్నదాన కార్యక్రమాలలో పాల్గొని వారందరినీ అభినందించారు. ఈ కార్యక్రమాలలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india