V1News Telangana

best news portal development company in india

అభిమాన నాయకుడికి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించిన పార్టీ శ్రేణులు ….

SHARE:

నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో సోమవారం రోజు తెలంగాణ వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని మాజీ ఎంపీటీసీ కంది మల్లేష్ నివాసంలో జన్మదిన వేడుక నిర్వహించారు.ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి విచ్చేసిన ఆయనకు మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం శ్యామల పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.

అనంతరం కేక్ కటింగ్ నిర్వహించారు. నాయకులు,కార్యకర్తలు అందరూ ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. భగవంతుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india