V1News Telangana

best news portal development company in india

ఎవరు ఆ భూ బకాసురులు….?సాలూర అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ పరిధిలోగల భూమి సర్వే నెంబరు ఏమిటి..ఎన్ని ఎకరాల భూమి ఉందో తెలియని వివరాలు.కబ్జాదారులకు ఓ మండల అధికారి సైతం సహకరిస్తున్నట్లు సమాచారం…

SHARE:

ఎవరు ఆ భూ బకాసురులు….?

– సాలూర అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ పరిధిలోగల భూమి సర్వే నెంబరు ఏమిటి..?

ఎన్ని ఎకరాల భూమి ఉందో తెలియని వివరాలు

ఫర్నిచర్, వీధి స్తంభాలు, జనరేటర్లు అన్ని మాయం 

ప్రేక్షక పాత్ర వహిస్తున్న సంబంధిత శాఖ అధికారులు 

అధికారం ఉన్న వారిదే రాజ్యమా…?

 

గత ప్రభుత్వ హయాంలో వాస్తవాలు వెలికి తీస్తామని శపథాలు చేసిన నాయకులు ఏమయ్యారు

తప్పించుకునే క్రమంలో నామమాత్రంగా గుడి నిర్మాణం చేపట్టిన కబ్జాదారులు 

చెక్ పోస్ట్ వద్ద విధులలో నిత్యం కానిస్టేబుల్ లు, ప్రైవేట్ అధికారులు మాత్రమే దర్శనం

ఉన్నతాధికారుల జాడ కానరాని వైనం 

ఇష్టా రీతిన మహా వృక్షాలను నరికిన వారిపై అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటారా…?

– కబ్జాదారులకు ఓ మండల అధికారి సైతం సహకరిస్తున్నట్లు సమాచారం

 

– ప్రభుత్వ స్థలాన్ని కాపాడతారా.. కబ్జాదారులకు సమర్పిస్తారా…?

– ఇప్పటికైనా సాలురా మండల ప్రజలు మేలుకొని ప్రజా ప్రతినిధుల ఆగడాలను ప్రశ్నిస్తారా….?

– సబ్ కలెక్టర్ చొరవ తీసుకొని కబ్జాదారుల ఆగడాలను అరికట్టాలని స్థానికుల డిమాండ్

 

బోధన్ ప్రతినిధి:

 

నిజామాబాద్ జిల్లా: బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండల కేంద్రంలో గల అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ పరిధిలోని భూమిలో గల మహా వృక్షాలను గుర్తుతెలియని వ్యక్తులు నరికి వేస్తూ వాటిని అధిక రేట్లకు విక్రయాలు చేసుకుంటున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. చెట్లు నరకడానికి ఎవరు అనుమతులు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ చెక్ పోస్ట్ అధికారులు మరియు అటవీశాఖ అధికారులు స్పందించకపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అసలు చెక్ పోస్ట్ పరిధిలోగల భూమిని కబ్జా చేసింది ఎవరు అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ తతంగం వెనుక బడా బాబుల హస్తం ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. “అధికారం ఉన్న వారిదే రాజ్యం” అన్నట్లు చర్యలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కబ్జాకోరుల నుండి ప్రభుత్వ స్థలాన్ని కాపాడి.. వాస్తవాలను వెలికి తీస్తామని శపథాలు చేసిన నాయకులు ఏమయ్యారని సర్వత్రా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న సర్వేలో చెక్ పోస్ట్ పరిధిలోని ప్రభుత్వ స్థలం కాపాడబడుతుందా, ఆ భూమి సర్వే నెంబరు ఏమిటి..? ఎన్ని ఎకరాలు భూమి ఉందో వివరాలు తెలుస్తాయా.. కబ్జా కోరుల నుండి ఆక్రమణకు గురైన భూమికి విముక్తి లభిస్తుందా వేచి చూడాలి. చెక్ పోస్ట్ భవనము పరిధిలో గల ఫర్నిచర్, జనరేటర్లు, వీధి స్తంభాలు ఏమయ్యాయి.. తప్పించుకునే క్రమంలో కబ్జాదారులు నామ మాత్రంగా గుడి నిర్మాణం చేపట్టి ఓ కుల సంఘానికి బాధ్యతలు అప్పగిస్తామని చెప్పినట్లు వినికిడి.. విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సైతం కబ్జాదారులతో చేతులు కలిపిన వైనం కనబడుతుంది. చెక్ పోస్టులో నిత్యం గమనించినట్లయితే విధులలో కానిస్టేబుల్ లు, ప్రైవేట్ అధికారులు మాత్రమే దర్శనమిస్తున్నారు. ఉన్నతాధికారుల జాడ కూడా కానరావడం లేదు.. కబ్జాదారులకు ఓ మండల అధికారి సహకరిస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది.

ఇంత జరుగుతున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ విషయంపై వెంటనే సబ్ కలెక్టర్ స్పందించి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి కబ్జాదారులు ఎంతటి వారైనా వారిపై కఠిన చర్యలు తీసుకొని.. చెక్ పోస్ట్ పరిధిలోని ప్రభుత్వ భూమిని కాపాడి దానికి విముక్తి కలిగించాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india