V1News Telangana

best news portal development company in india

భాజపా శ్రేణుల విజయోత్సవ సంబరాలు….

SHARE:

నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించిన సందర్భంగా శనివారం రోజు నసురుల్లాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు సున్నం సాయిలు ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో వారు బాణాసంచా కాల్చి, పరస్పరం మిఠాయిలు పంచుకొని ఈ సందర్భంగా మండల అధ్యక్షులు సున్నం సాయిలు మాట్లాడుతూ గత 27 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ మరియు ఆమ్ ఆద్మీ పార్టీలను మట్టికరిపించి భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించింది అని అన్నారు. ఈ విజయం భారతదేశ అభ్యున్నతికి మార్గదర్శకంగా ఉంటుందని అన్నారు. ఈ విజయంతో బిజెపి పార్టీ శ్రేణులలో నూతన ఉత్సాహం నింపుతుందని.. అదే స్ఫూర్తితో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తాను చాటి అత్యధిక స్థానాలలో గెలుపొందే విధంగా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి జిల్లా అధికార ప్రతినిధి చందూరి హన్మండ్లు యాదవ్, ప్రధాన కార్యదర్శి మేకల రాములు యాదవ్,కిసాన్ మోర్చా అధ్యక్షులు గొడిసెల యాదగిరి గౌడ్ ,యువ మోర్చా అధ్యక్షులు ర్యాపని మహేష్, సీనియర్ నాయకులు గంగాధర్ గుప్త, అరిగె నారాయణ, పెర్క రాములు,చరణ్ యాదవ్ భూత్ అధ్యక్షులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india