V1News Telangana

best news portal development company in india

పేకాట స్థావరంపై దాడి….

SHARE:

– 9 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

– 9 చరవాణిలు,6 ద్విచక్ర వాహనాలు, నగదు రూ.1190 స్వాధీనం

– నెలరోజుల వ్యవధిలో నాలుగు చోట్ల దాడులు

– పేకాట ఆడుతూ దొరికితే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని హెచ్చరిక

– నసురుల్లాబాద్ ఎస్సై లావణ్య

: నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా:నసురుల్లాబాద్ మండలంలోని అంకోల్ గ్రామంలో పేకాట ఆడుతున్న 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 9 చరవాణిలు,6 ద్విచక్ర వాహనాలు మరియు నగదు రూ.1190 స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నెలరోజుల వ్యవధిలోనే నాలుగు పేకాట స్థావరాలపై దాడి చేసి కేసులు నమోదు చేశామని తెలిపారు. అందులో హాజీపూర్, దుర్కి, బొమ్మన్దేవ్ పల్లి, అంకోల్ గ్రామాలు అని అన్నారు. పేకాట ఆడుతూ దొరికినట్లయితే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని కచ్చితంగా కేసులు పెడతామని ఎస్సై లావణ్య హెచ్చరించారు. ఎక్కడైనా పేకాట నిర్వహించినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సూచించారు. దాడిలో అందుబాటులోకి తీసుకున్న పేకాటరాయుళ్లపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తామని తెలియజేశారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india