V1News Telangana

best news portal development company in india

ఉత్కంఠభరితంగా కొనసాగిన కుస్తీ పోటీలు….

SHARE:

– కుస్తీ పోటీలను తిలకించడానికి అధిక సంఖ్యలో హాజరైన ప్రజలు

– తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక నుండి పోటీలో పాల్గొన్న మల్ల యోధులు

– ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎస్సై లావణ్య

నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని బొమ్మన్ దేవ్ పల్లి గ్రామంలో అల్లమా ప్రభు జాతర సందర్భంగా చివరి రోజు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలో నిర్వహించారు. కుస్తీ పోటీలను తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా కుస్తీ పోటీలలో పాల్గొనడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి మరియు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ల నుండి మల్లయోధులు పాల్గొన్నారు. కుస్తీ పోటీలు ఉత్కంఠ భరితంగా కొనసాగాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్సై లావణ్య హాజరయ్యారు. చివరి కుస్తీ పోటీ లో గెలుపొందిన మల్ల యోధునికి రూ.2100 నగదు బహుమతిని ఎస్సై లావణ్య, మాజీ సర్పంచ్ అన్నం సత్యనారాయణ , నాయకులు పవన్ గౌడ్ చేతుల మీదుగా అందించారు.

ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకట్రావ్, గ్రామస్తులు శ్రీనివాస్ రెడ్డి, నిఖిల్ గౌడ్, కురుమ గంగారం, కురుమ భాస్కర్, కరుణాకర్ గౌడ్, సంజీవ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మహేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india