V1News Telangana

best news portal development company in india

మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థతకు గురైన విద్యార్థులు….

SHARE:

కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం రోజు మధ్యాహ్న భోజనం వికటించడం వలన విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం 3:00 గంటల ప్రాంతంలో విద్యార్థులు తీవ్ర కడుపు నొప్పిగా ఉందంటూ వాంతులు, విరోచనాలు చేసుకోవడంతో వెంటనే స్పందించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు అప్రమత్తమై వారిని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. ప్రభుత్వం ఎన్నిసార్లు విద్యార్థుల భోజనం విషయంలో హెచ్చరించినప్పటికీ ఇలాంటి సంఘటనలు పునరావృతం ఇవ్వడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india