V1News Telangana

best news portal development company in india

పసిపిల్లలకు పోషకాహార లోపం శాపమా…?

SHARE:

– నివారణ చర్యలకు VOA, గ్రామ సంఘం సభ్యులకు శిక్షణ తరగతులు

– పిల్లల సంరక్షణ పట్ల తగు జాగ్రత్తలు పాటించాలి

– APM కులకర్ణి జగధీష్

కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల ఐకీపీ కార్యాలయంలో సోమవారం రోజు పసిపిల్లలలో పోషకాహార లోపం నివారణ గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుండి శిక్షకులుగా ఏపీఎం కులకర్ణి జగదీష్, సీసీ మెహర్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గ్రామాలలో ఐదేళ్ల లోపు చిన్నారులలో రోజురోజుకు పోషకాహార లోపం విపరీతంగా పెరుగుతుందని.. అందువల్ల వారిలో శారీరక పెరుగుదల, మానసిక వికాసం, జ్ఞాపకశక్తి బలహీన పడుతున్నాయని తెలిపారు. పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి సాధారణ ఆరోగ్య మరియు పోషకాహార పద్ధతులను అనుసరించి పరిష్కరించవచ్చని సూచించారు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో, పిల్లల ఎదుగుదలలో మొదటి రెండు సంవత్సరాలు మొత్తం 1000 రోజులు (గర్భధారణ 270 రోజులు, మొదటి సంవత్సరం పెరుగుదలలో 365 రోజులు, రెండవ సంవత్సరం పెరుగుదలలో 365 రోజులు) ఎంతో కీలకమని అన్నారు. ఈ నేపథ్యంలో సమస్యను అధిగమించడానికి NIRDPR, యూనిసెఫ్, మరియు సెర్ప్ సంస్థలు కలిసి సంయుక్తంగా SHG మహిళలు వారి కుటుంబాల కొరకు ప్రత్యేకమైన శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ వాణి, శిక్షణ తీసుకోవడానికి మండల సమాఖ్య ఓబీలు శోభారాణి, పోచవ్వ, జ్యోతి, ఏపీఎం గంగాధర్, సీసీ హన్మండ్లు , అకౌంటెంట్ యశ్వంత్ రెడ్డి, VOA లు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india