V1News Telangana

best news portal development company in india

“కళ్యాణ లక్ష్మి”, “షాదీ “ముబారక్”పేదల పాలిట వరం….

SHARE:

– లబ్ధిదారులకు బ్యాంకు చెక్కులు అందజేత

– ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడుతుంది

– పంపిణీ చేసిన తెలంగాణ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి

కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణ కేంద్రంలో గల తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ మరియు గ్రామీణ మండలం, నసురుల్లాబాద్, మోస్రా మండలాలకు చెందిన లబ్ధిదారులకు “కళ్యాణ లక్ష్మి”, “షాదీ ముబారక్ “బ్యాంకు చెక్కులను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి.. తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్ రాజ్ తో కలిసి అందించారు. బాన్సువాడ పట్టణంలో 41 మంది లబ్ధిదారులకు గాను రూ .41,04,756 , బాన్సువాడ గ్రామీణ మండలంలో 77 మంది లబ్ధిదారులకు గాను రూ.77,08,932, నసురుల్లాబాద్ మండలంలో 32 మంది లబ్ధిదారులకు గాను రూ.32,03,712, మోస్ర మండలంలో 31 మంది లబ్ధిదారులకు గాను రూ.31,03,596, మొత్తం 181 మంది లబ్ధిదారులకు కలిపి రూ.1,81,20,996 పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి, బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం శ్యామల శ్రీనివాస్, వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా, మాజీ ఎంపీపీ పాల్త్య విట్టల్, మాజీ ఎంపీటీసీ కంది మల్లేష్, ఆయా మండలాల తహసిల్దార్లు మరియు ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india