V1News Telangana

best news portal development company in india

రేషన్ షాపు ఏర్పాటు చేయాలి….

SHARE:

– ఆవేదన వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు

– సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టికి వినతిపత్రం అందజేత

– కాలనీ నాయకులు యం .డి.యూనుస్

కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర్ కాలనీవాసులు సోమవారం రోజు వారి కాలనీలో నూతనంగా రేషన్ షాపును ఏర్పాటు చేయాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కాలనీ నాయకుడు యం.డి. యూనుస్ మాట్లాడుతూ పట్టణంలో సంగమేశ్వర కాలనీ ఏర్పాటు సుమారుగా 25 సంవత్సరాలు గడిచిపోయాయని అన్నారు. దాదాపుగా 1500 కుటుంబాలు నివాసముంటున్నప్పటికీ ఇప్పటివరకు కాలనీలో పేద ప్రజలకు ప్రభుత్వం అందించే రేషన్ షాప్ ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటివరకు పలుమార్లుఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇచ్చుకుంటూ వస్తున్నామని..అయినప్పటికీ నాయకులు, అధికారులు స్పందించి రేషన్ షాపు ఏర్పాటు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాలనీ ప్రజల మీద దయతలచి రేషన్ షాపు త్వరిత గతిన ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మతిన్, వాసిఫ్, ఇలియాస్, బాసిత్, మధు, రాజు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india