– పలు ప్రభుత్వ కార్యాలయాలలో పతాకవిష్కరణ
– తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మార్వో ఎల్ .ప్రవీణ్ కుమార్ పతాకావిష్కరణ
కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా:నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో గల తహసిల్దార్ కార్యాలయంలో ఆదివారం రోజు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ ఎల్ ప్రవీణ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసులు గౌరవ వందనం నిర్వహించారు. పలు ప్రభుత్వ కార్యాలయాలలో.. విద్యాశాఖ కార్యాలయంలో ఎంఈఓ చందర్, పోలీస్ స్టేషన్లో ఎస్సై లావణ్య, ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు
గునిగెరి హన్మండ్లు, సహకార సంఘం సొసైటీ కార్యాలయం ఆవరణలో సొసైటీ చైర్మన్ గంగారం యాదవ్, అంబేద్కర్ విగ్రహం , అంబేద్కర్ సంఘం అధ్యక్షులు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.వివిధ శాఖల కార్యాలయంలో
అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో వివిధ కార్యాలయా లలో, గ్రామ ప్రత్యేక అధికారులు, ప్రభుత్వ పాఠశాలలోప్రధానోపాధ్యాయులు
గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ బావయ్య, ఆర్ ఐ సాయిలు, ఎంపీడీవో సూర్యకాంత్, నసురుల్లాబాద్ గ్రామ మాజీ సర్పంచ్ అరిగె సాయిలు, మాజీ ఎంపిటిసి కంది మల్లేష్ , బిజెపి మండల అధ్యక్షులు సున్నం సాయిలు,గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజేష్, అయినాల లింగం, శివప్రసాద్, సున్నం సాయిలు, గ్రామ పెద్దలు యువకులు విద్యార్థిని, విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








