V1News Telangana

best news portal development company in india

ప్రజలకు నిస్వార్ధంగా సేవలు చేయడమే నా లక్ష్యం నాపై ఆరోపణలు చేస్తున్న వారు ఐదు రూపాయలు విరాళంగా ఇవ్వమని చెప్పండి సవాల్ విసురుతున్న ఎన్నికల్లో పోటీ చేయడం, రిజర్వేషన్ ఏది వస్తుందో తెలియదు, అధిష్టానం నిర్ణయించాల్సి వస్తుంది, తనపై ఎన్ని విమర్శలు చేసినా తాను పట్టించుకోను ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం ప్రజలకు ఏ రూపంలోనైనా సేవలు చేయడంలో నేనెప్పుడూ ముందుంటా

SHARE:

ప్రజలకు నిస్వార్ధంగా సేవలు చేయడమే నా లక్ష్యం
నాపై ఆరోపణలు చేస్తున్న వారు ఐదు రూపాయలు విరాళంగా ఇవ్వమని చెప్పండి సవాల్ విసురుతున్న
ఎన్నికల్లో పోటీ చేయడం, రిజర్వేషన్ ఏది వస్తుందో తెలియదు, అధిష్టానం నిర్ణయించాల్సి వస్తుంది,
తనపై ఎన్ని విమర్శలు చేసినా తాను పట్టించుకోను ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం
ప్రజలకు ఏ రూపంలోనైనా సేవలు చేయడంలో నేనెప్పుడూ ముందుంటా…

పొతంగల్
ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యమని, ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా పక్కన పెట్టి, కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆదుకోవడమే తన కర్తవమని, ప్రముఖ సామాజిక కార్యకర్త ఎం,ఏ హకీమ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలం జల్లాపల్లి ఆబాది గ్రామంలో అంగన్వాడి పాఠశాలలో విద్యార్థులకు ప్లేట్లు ఫర్నిచర్లు, ప్రాథమిక పాఠశాలలో ప్లేట్లు పంపిణీ ఎం ఏ హకీం అందజేశారు, మొత్తం 150 మంది విద్యార్థులకు ఈ సామాగ్రి అందజేశారు, అనంతరం ఆయనకు గ్రామస్తులు ,అంగన్వాడి టీచర్లు, ప్రైమరీ స్కూల్ టీచర్లు, విద్యార్థులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, తాను సేవలు చేస్తుంటే కొంతమంది ఓర్వలేక లేనిపోని నిందలు వేస్తున్నారని, తనకు సేవ చేయకుండానే కుట్రలు చేస్తున్నారని, విమర్శలు చేసేవారు ఆపదలో ఉన్న ప్రజలకు ఐదు రూపాయలు ఇచ్చి చూడమను, వారు చేయరు, ఇతరులకు చేయనీయరు, ఆపదలో కష్టాల్లో ఉన్నవారికి ఆదుకోరు, అలాంటి వారి మాటలు పక్కనపెట్టి ప్రజల కోసమే తన జీవితం త్యాగం చేస్తానని, ప్రతినిత్యం సేవలో ఉంటా అన్నారు, జడ్పిటిసిగా ,ఎంపీపీగా పోటీ చేస్తున్నానని కొంతమంది ఈ ఎన్నికల్లో నిలబడడానికి,, నిలబడతానని తాను ఎప్పుడూ అనుకోలేదని, అనుకుంటా లేదని అన్నారు, ఎన్నికల్లో పోటీ చేయడం ,రిజర్వేషన్ లు ప్రభుత్వం ఏది ఇస్తుందో తెలవదని, అధిష్టానం నిర్ణయం ఉంటుందని అన్నారు, పదవులపై పోటీపై తనకు దృష్టి లేదని కేవలం ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని అన్నారు. జల్లాపల్లి గ్రామం జల్లాపల్లి ఆభది గ్రామం, జల్లాపల్లి ఫారం గ్రామం అంతా తనకు ఒక కుటుంబం లాంటిదని, కుటుంబంలో ఒక తండ్రి పిల్లలకు పోషిస్తాడని ఈ పోషన్లో భాగంగా కష్టపడతారని ఆ కష్టం ఎక్కడ ఏమిటి అనే వివరాలు చెప్పడని పిల్లలు కూడా అడగరని, అలాగే తాను ఈ గ్రామాలను ఒక కుటుంబం గా చూస్తానని అన్నారు, ఈ గ్రామమే కాకుండా ఇతర గ్రామాలు మండలం ఇతర మండల కు కూడా తన సేవలు ఉంటాయని అన్నారు. జల్లాపల్లి ఆబాది గ్రామంలో తన కుటుంబ సభ్యుల స్థలం విషయంలోనే తాను అధికారుల వద్దకు వెళ్లడం జరిగిందని అంతేతప్ప ఎలాంటి రాజకీయం చేయలేదని ఇక్కడున్న ప్రతి ఒక్క పెద్దలు గమనించాలని అన్నారు, మనమంతా ఐక్యమత్యంతో అన్నదమ్ముల వలే కలిసి ముందుకు వెళ్లి గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈనెల 26వ తేదీన బిజెపి లీడర్ శేఖర్ కొంతమంది భక్తులు, కుంభమేళకు వెళ్తున్నారని తన దృష్టికి తేవడం జరిగిందని కచ్చితంగా తన సొంత ఖర్చులతో పంపిస్తానని హామీ ఇచ్చారు. వాటి వివరాలన్నీ తనకు అందజేయాలని తప్పకుండా తన కృషిని అందజేస్తానని తెలిపారు. కుల మతాలకు అతీతంగా, వర్గ విభేదాలకు అతీతంగా, ప్రజలంతా బాగుండాలని గ్రామాలు అభివృద్ధి చెందాలని తన సేవలను చేస్తున్నానని అన్నారు..

మైనార్టీలలో కోటీశ్వరులు ఉన్నారు
సేవ చేయడానికి ఎవ్వరూ ముందుకు రారు
భగవంతుని రూపంలో ఏం ఏ హకీ కుల మతాలకు అతీతంగా సేవలు చేయడం అదృష్టం

మైనార్టీలలో ఎంతో మంది కోటీశ్వరులు ఉన్నారని డబ్బు బాగా ఉన్నప్పటికీ ఎవరు కూడా సేవలు చేయడానికి ముందుకు రావడంలేదని కనీసం వంద రూపాయలు సహాయం అందించడానికి ముందుకు రాని వారు ఉండడం బాధాకరమని, అలాంటి తరుణంలో ఎం ఏ హకీం భగవంతుని రూపంలో కుల మతాలకు అతీతంగా ఆపదలో కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆదుకోవడం సహాయ సహకారాలు అందజేయడం ఎంతో అదృష్టమని, మాజీ సర్పంచ్ ఎజాజ్ ఖాన్ అన్నారు. ఎం ఏ హకీమ్ తన సొంత గ్రామంలో కాకుండా ఇతర గ్రామాలకు కూడా తన సేవలను విస్తరింప చేయడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. హంగర్గా ఫారం గ్రామంలో ఎంతో పేద కుటుంబం అయినా యువతి పెళ్లికి పైసలు లేకపోవడంతో చందా రూపంలో అడిగే పరిస్థితి ఉన్నప్పుడు ఆ విషయం జల్లాపల్లి ఫారం కు చెందిన సేరు ద్వారా ఎం ఏ హకీంకు చెప్పడంతో, వెనుక ముందు ఆలోచించకుండా సుమారు లక్ష రూపాయల వరకు ఆర్థిక సాయం అందజేసి యువతి పెళ్లికి చేయూతనియడం గొప్ప విషయమని ఆయన కొనియాడారు, పేద ప్రజలు ఎక్కడ కష్టం ఉన్న అక్కడ సమాచారం అందితే చాలు వారికి సాయం అందించడం కోసం ముందుంటున్నారు ఆయన సేవలు అద్భుతం అని అన్నారు. స్థానిక ఎన్నికల్లో హకీం ఎంపీపీ, జడ్పిటిసి ఎలక్షన్ లో నిలబడుతున్నారని వదంతుల విషయంపై ఆయన దృష్టికి తీసుకువెళ్లగా, తాను రాజకీయం వైపు ఏ మాత్రం దృష్టి పెట్టడం లేదని, తనకు పదవుల కంటే పేద ప్రజలకు కష్టాల్లో ఆపదలు ఉన్నవారికి ఆదుకోవడమే తన ప్రధాన కర్తవమని తనకు సమాధానం ఇవ్వడం జరిగిందని ఇది ఎంతో పెద్ద విషమని అన్నారు. ఎన్నికలో నిలబడాలంటే ప్రజల మద్దతు కావాలని ప్రజలు కోరుకోవాలని, అధిష్టానం నిర్ణయం ఉండాలని రిజర్వేషన్ ఉంటుందని ఆ విషయం విమర్శలకు తెలియదా లేనిపోని నిందలు హకీంపై వేయడం దారుణమని మండి పడ్డారు సేవలు చేసే వారికి ప్రోత్సహించేది పోయి విమర్శలు చేయడం బాధాకరమని అన్నారు, ఇలాంటి వదంతులు చేసేవారు విమర్శకులు మంచి చెడ్డలు ఆలోచించి ప్రజలకు ఆదుకునే వారికి ప్రోత్సహిస్తే వారి సేవలు ఇంకా ప్రజలకు చేరుతాయని, విమర్శకులు విమర్శలు ఆపి ప్రజలకు ఆదుకోవడంలో తమ వంతు సహకారం చెయ్యకున్నప్పటికీ ఇలాంటి వారికి మద్దతు ఇవ్వడంలో తమ వంతు కృషి అందిస్తే, ఎంతోమంది బతుకులు బాగుపడతాయని అన్నారు. ఉప సర్పంచ్ భీమ మాట్లాడుతూ
కుటుంబంలో కుటుంబ సభ్యులకు డబ్బులు ఇవ్వడానికి వెనుక అడుగు వేసే ఈ రోజుల్లో ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి వేల డబ్బులు లక్షల డబ్బులు సహాయం చేయడం కోసం ముందుకు వస్తున్న ఎం ఏ హకీమ్ సేవలు అద్భుతం అని, అలాంటి వారికి పాదాభివందనాలని అన్నారు. ఇలాంటి వారికి విమర్శలు చేసేవారు ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. పేద ప్రజలకు, ఆడపడుచులకు, అన్ని వర్గ ప్రజలకు కష్టాల్లో ఉన్న వారికి ఆపద్బాంధవుడు, హకీం భాయ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రేణి రాములు, జల్లపల్లి ఫారం మాజీ సర్పంచ్ సేరు, మాజీ సర్పంచ్ వివేక్, మాజీ ఎంపీటీసీ రాములు, బిజెపి నాయకులు పబ్బ శేఖర్, అంగన్వాడి టీచర్ జయ, ఆశ వర్కర్ నాగమణి దేవి సింగ్, యూసుఫ్, గ్రామ పెద్దలు ఉన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india