నిజామాబాద్ జిల్లా కోటగిరి, పొతంగల్ ఉమ్మడి మండలాల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా జోరుగా కొంతమంది కోడిపందాలు నిర్వహించినట్టు విమర్శలు గుప్పుమంటున్నాయి.
సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి పొతంగల్ మంజీరా శివారు ప్రాంతం తో పాటు హంగర్గా శివారు ప్రాంతం తో పాటు పలుచోట్ల కొంతమంది కోడిపందాల నిర్వాహకులు కోడిపందాలు జోరుగా ఆడినట్టు ఆడిపించినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి, ఈ కోడిపందాల ఆటల నిర్వహణలో అధికార పార్టీ నాయకులతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది అధికారులు అండదండలతో జోరుగా కొనసాగినట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి, వారి అండదండలతో కోడిపందాలు జోరుగా నిర్వహించినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. మంగళవారం ఈ విషయం బయటికి పొక్కడంతో జిల్లా ఇన్చార్జి సిపి ఇంటలిజెన్స్ తో పాటు ఎస్బిని విచారణ కోసం పంపించినట్టు సమాచారం. ఈ కోడిపందాల ఆట తీరుపై ఎస్బీ ఇంటెలిజెన్స్ వారు క్షేత్రస్థాయిలో విచారణ ప్రారంభించినట్టు విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే కోడిపందాల ఆటలు కొనసాగించిన వారు నిర్వహించిన వారి పేర్లు వెల్లడి అయినట్టు తెలుస్తుంది అయితే వారి వివరాలు గ్రౌండ్ లెవెల్ లో ఎంక్వయిరీ చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా కోడిపందల ఆట రహస్యంగా నిర్వహించడం పట్ల పలువురు విస్మయానికి గురి అవుతున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








