కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: కలెక్టర్ కార్యాలయంలో బిసి వెల్ఫేర్ విభాగంలోవిధులు నిర్వహించి ఈ మధ్యకాలంలో బదిలీపై వెళ్లిన అధికారులకు నసురుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామ శివారులో గల కొచ్చేరు మైసమ్మ ఆలయం వద్ద సన్మాన కార్యక్రమం నిర్వహించి వీడ్కోలు పలికారు.

గత 8 ఏళ్లుగా నిర్విరామంగా కామారెడ్డి జిల్లా బిసి డెవలప్మెంట్ అధికారిగా విధులు నిర్వహించిన శ్రీనివాస్, బీసీ ఉద్యోగ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవంత్ లను పూలమాల, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా క్రింది స్థాయి సిబ్బంది మాట్లాడుతూ కార్యాలయంలో వారు లేని లోటు స్పష్టంగా కనబడుతుందని ఉద్యోగస్తులు భావోద్వేగానికి గురయ్యారు. గత ఎనిమిది సంవత్సరాలుగా వారి దిశానిర్దేశానుసారం, క్రమశిక్షణతో విధులను నిర్వహించామని.. అదేవిధంగా వారు మాతో స్నేహపూర్వకంగా మెదిలిన విధానం మేము ఎప్పటికీ మర్చిపోలేము అని వారు కన్నీటి పర్యంతమయ్యారు. వారు భగవంతుని ఆశీస్సులతో పూర్తి సర్వీసును ముగించుకొని..నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ఉద్యోగ సంఘం అధ్యక్షులు నాగరాజు, ఈసి ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు భాగయ్య, సరస్వతి ,సుధాకర్ ,ఆశిష్ తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








