V1News Telangana

best news portal development company in india

బోధన్ గౌడ్స్ కాలనీ లో ఘనంగా ముగ్గులపోటీలు

SHARE:

బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ ప్రాంతంలో గల గౌడ్స్ కాలనీ లో ఆదివారం రోజున సంక్రాంతి పండగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలను గౌడ్స్ కాలనీ సభ్యులు మరియు బజరంగ్ధల్ గణేష్ మండలి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ తాజా మాజీ గవర్నర్ లయన్ వేమూరి లక్ష్మి హాజరు అయ్యారు ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో 48 మంది ముగ్గులపోటీలో పాల్గొన్నారు ముగ్గుల పోటీలలో ప్రతిభ కనబరిచిన వారికి మొదటి. దృతీయ. తృతీయ. బహుమతులు మరియు పోటీలో పాలుగొన్నవారికి కూడా బహుమతులు ఇవ్వడం జరిగింది ముఖ్య అతిథిగా పాలుగొన్న లయన్ వేమూరి లక్ష్మి కూడా గెలుపొందిన వారికి వారి పక్షాన సహాయాన్ని బహుమతి రూపంలో అందించారు. ఇందులో కాలనీ మరియు చుట్టుపక్కల కాలినీ వాసులు దాదాపు 200మంది పాలుగొన్నారు ఈ సందర్భంగా .కాలనీ వాసులు మాట్లాడుతూ ముగ్గుల పోటీలనుఎంతో ఘనంగా నిర్వహించిన గణేష్ మండలి ఉత్సవ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఇ కార్యక్రమంలో గణేష్ మండలి ఉత్సవ కమిటీ సభ్యులు, గౌడ్స్ కాలనీ కమిటీసభ్యులు శ్యాంసుందర్ రాజేశ్వర్ తులసి ప్రశాంత్ శ్రీనివాస్ గౌడ్ ఏ శాల గంగాధర్ శివాలయం మా రాజు బర్ల పద్మ నాగన్న చంద్ర కిరణ్ మారుతి గంగాధర్ పాండు గంగాధర్ పటేల్ రేణుక సునీత సావిత్రి లక్ష్మి అనిత తదితరులు పాల్గొన్నారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india