– ఘనంగా నిర్వహించిన వాసవి స్కూల్ యాజమాన్యం
– భోగి మంటలు, ఆటపాటలు బొమ్మల కొలువు, పిండి వంటలతో సందడి
– రంగురంగుల ముగ్గులతో కలకలలాడిన పాఠశాల ప్రాంగణం
– సాంప్రదాయ దుస్తులు ధరించి వేషధారణల్లో అలరించిన చిన్నారులు
బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ కేంద్రంలో గల వాసవి హైస్కూల్ లో శుక్రవారం రోజు పాఠశాల యాజమాన్యం ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు సాంప్రదాయ వస్త్రాలను ధరించి పాల్గొన్నారు.ఈ సందర్భంగా చిన్నారులు సాంప్రదాయ దుస్తులు ధరించి వివిధ రకాల వేషధారణలో ప్రదర్శనలు చేసి అలరించారు. భోగిమంటలతో మొదలై..ఎంతో ఉత్సాహంగా ఆటపాటలతో పాఠశాల ప్రాంగణంలో సందడి నెలకొంది.

విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో రంగురంగుల ముగ్గులను అలంకరించారు.రకరకాల పిండి వంటలను సిద్ధం చేసి భగవంతుడికి నైవేద్యం నివేదించి..బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు.ఈవేడుకలు పట్టణ ప్రజలను బాగా ఆకర్షించాయి.

సాంకేతికత అభివృద్ధి చెందిన తర్వాత సమాజంలో పండుగల ప్రాధాన్యత మరియు సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగవుతున్న నేటి సమాజంలో..విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు సంస్కృతి,సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పిస్తూ భావితరాలకు మార్గదర్శకులుగా ఇలాంటి వేడుకలు నిర్వహిస్తున్నందుకు..పలువురు పట్టణ ప్రజలు పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








