– ముఖ్యఅతిథిగా విచ్చేసిన బిజెపి జిల్లా అధ్యక్షురాలు అరుణతార
బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముందస్తుగా గురువారం రోజు బిజెపి ఆధ్వర్యంలో ( NRI) కోనేరు శశాంక్ ఆర్థిక సహకారంతో రామాలయం ప్రాంగణంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా అధ్యక్షురాలు అరుణతార, ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ముగ్గుల పోటీలలో అధిక సంఖ్యలో మహిళలు ఉత్సాహంగా పాల్గొనడంతో పోటీలు సందడిగా జరిగాయి. రంగవల్లులతో రామాలయం ప్రాంగణం సర్వాంగ సుందరంగా కళను సంతరించుకుంది.

ఈ సందర్భంగా మహిళలు చిత్రించిన అందమైన ముగ్గులు అందర్నీ ఆకట్టుకున్నాయి. పోటీలో గెలుపొందిన వారికి బిజెపి జిల్లా అధ్యక్షురాలు అరుణతార చేతులమీదుగా శాలువాతో సన్మానించి నగదు బహుమతులు.. ప్రథమ బహుమతి రూ.2516, ద్వితీయ బహుమతి రూ.1616, తృతీయ
బహుమతి 1116 అందించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు అరుణతార మాట్లాడుతూ బిజెపి నసురుల్లాబాద్ మండల శాఖ ముగ్గుల పోటీ నిర్వహించడం సంతోషకరమన్నారు. కార్యక్రమ నిర్వహణకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

మహిళలు అందంగా ముగ్గులను అలంకరించాలని అన్నారు. తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరారు. జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నసురుల్లాబాద్ మండల అధ్యక్షుడు సున్నం సాయిలు మాట్లాడుతూ ముగ్గుల పోటీలకు విచ్చేసిన ముఖ్య అతిథులకు.. అదేవిధంగా కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేశారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








