– లీగల్ ఎయిడ్ కౌన్సిల్ తో పలు విషయాలపై చర్చ
– న్యాయ సహాయం పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి
– జడ్జి టిఎస్పి భార్గవి సూచనలు
బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలో గల కోర్టు ఆవరణలో గురువారం రోజు న్యాయమూర్తి TSP భార్గవి ఆధ్వర్యంలో బాన్సువాడ బార్ అసోసియేషన్ సభ్యులు మరియు లీగల్ ఎయిడ్ కౌన్సిల్ MA .ఖలీల్,R. మోహన్ రెడ్డి ,M. లక్ష్మీనారాయణ మూర్తి మరియు P. మొగులయ్య తదితరులతో కలిసి న్యాయ సేవాధికార సంస్థకు సంబంధించిన పలు విషయాలను చర్చించారు. ఈ సందర్భంగా జడ్జి భార్గవి మాట్లాడుతూ న్యాయవాదులను నియమించుకునే స్తోమత లేని బాధితులు, ఖైదీలు చాలామంది ఉన్నారన్నారు. అటువంటి వారికి న్యాయవాదులు మానవతా దృక్పథంతో న్యాయ సహాయం అందించాలని.. అదేవిధంగా న్యాయ సహాయం పైన పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని లీగల్ ఎయిడ్ కౌన్సిల్ కు సూచించారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








