– అవగాహన కల్పించిన పోలీసులు
కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో బుధవారం రోజు జరిగిన వారాంతపు సంతలో పోలీసులు ప్రజలకు సైబర్ క్రైమ్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజురోజుకు నేరగాళ్ల బారినబడి ప్రజలు బాధితులుగా మారుతున్నారన్నారు. ఇలాంటి చర్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చైన్ స్నాచింగ్, సైబర్ క్రైమ్ లు ఎలా జరుగుతున్నాయో ప్రజలకు వివరించారు. ఆన్ లైన్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి తమ బ్యాంకు వివరాలను అడిగినట్లయితే ఇవ్వకూడదని.. అటువంటి పరిస్థితులలో వెంటనే పోలీసులకు ఫిర్యాదు అందించాలని తెలిపారు. అనుమానాస్పదంగా వ్యక్తులు ఎవరైనా తిరుగుతూ కనిపించినట్లయితే వెంటనే సమాచారం అందించాలన్నారు. ప్రజలు ఎక్కువగా గుంపులు గుంపులుగా ఉండే చోట చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు దేవ సహాయం, జావేద్, మాటిన్ తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








