– ఐక్య విద్యార్థి సంఘాల డిమాండ్
నిజామాబాద్ ప్రతినిధి:
నిజామాబాద్ జిల్లా:అడ్మిషన్ నోటిఫికేషన్ రాక ముందే డిస్కౌంట్ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ నారాయణ జూనియర్ కళాశాల యాజమాన్యం ఫీజుల దోపిడీ చేస్తుందని ఆరోపిస్తూ బుధవారం రోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో (DIEO) కార్యాలయంలో (AIPSU),(AIFDS),(TGVP),(TVUV), (GVS),(AISB) విద్యార్థి సంఘాల నాయకులు వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా AIPSU రాష్ట్ర అధ్యక్షులు బోడ అనిల్ మాట్లాడుతూ నారాయణ జూనియర్ కాలేజ్ ప్రభుత్వం అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేయకముందే నిబంధనలకు విరుద్ధంగా డిస్కౌంట్ ల పేరుతో అడ్మిషన్లు నిర్వహిస్తోందని.. దీనితోపాటు రెసిడెన్షియల్ బిల్డింగ్ లో కళాశాలను నిర్వహిస్తూ.. విద్యార్థుల నుండి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఫీజుల దోపిడీకి పాల్పడుతున్న నారాయణ జూనియర్ కాలేజ్ యొక్క గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా తప్పుడు ర్యాంకులతో కరపత్రాలను ముద్రించి ఎక్కడో వచ్చిన ర్యాంకులను నిజామాబాద్ క్యాంపస్ లోనే సాధించారంటూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారన్నారు. సుభాష్ నగర్ లో గల నిర్మాణ దశలో ఉన్న పిల్లర్లను చూపిస్తూ.. భవన నిర్మాణం పూర్తయింది అంటూ అడ్మిషన్లు చేస్తున్నారని అన్నారు . అధికారులను సైతం బురిడీ కొట్టిస్తున్న నారాయణ కళాశాల యొక్క గుర్తింపును రద్దుచేసి తప్పుడు ర్యాంకులతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసగిస్తూ ఇప్పుడు అడ్మిషన్ తీసుకుంటే రూ.10 వేలు డిస్కౌంట్ అంటూ అదనంగా వసూలు చేస్తున్న నారాయణ యజమాన్యం నిజామాబాద్ బ్రాంచ్ లో ఉన్న బాధ్యుల పై క్రిమినల్ కేసులు పెట్టి నారాయణ కళాశాల యొక్క గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో (AIFDS) జాతీయ కన్వీనర్ మేత్రి రాజశేఖర్,(TGVP) జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్, (TVUV)రాష్ట్ర అధ్యక్షులు లాల్ సింగ్,(GVS) జిల్లా అధ్యక్షులు జైత్రామ్ రాథోడ్,(AISB) రాష్ట్ర నాయకులు రాహుల్, జిల్లా అధ్యక్షులు భైరాపూర్ రవీందర్ గౌడ్,(AIPSU )గోపాల్ సింగ్ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








