V1News Telangana

best news portal development company in india

కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించిన దాడి పట్ల నిరసన తెలిపిన బిజెపి నాయకులు…..

SHARE:

– బిజెపి రాష్ట్ర కార్యాలయం పై దాడి హేహమైన చర్య

– విద్వేషాలను రెచ్చగొడుతూ చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు

– హోం శాఖ మంత్రి పదవి ముఖ్యమంత్రి ఆధీనంలోనే

– శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమైన హోం శాఖ

– బాన్సువాడ పట్టణ బిజెపి అధ్యక్షులు తుప్తి శివప్రసాద్

కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: మంగళవారం రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువజన కాంగ్రెస్ నాయకులు బిజెపి రాష్ట్ర కార్యాలయం పై దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.. దీనిని ఖండిస్తూ బిజెపి బాన్సువాడ పట్టణ అధ్యక్షులు తుప్తి శివప్రసాద్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన తెలిపారు. ఈ సంఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు స్పందించకపోవడం చాలా బాధాకరం అని అన్నారు. హోం శాఖ మంత్రిత్వ బాధ్యతలు ముఖ్యమంత్రి ఆధీనంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పూర్తిస్థాయిలో విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సంస్కారహీనులుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం పై ఇలాంటి దాడులు నిర్వహించడం సిగ్గుచేటు అని అన్నారు. విద్వేషాలను రెచ్చగొడుతూ చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ పాలన, ప్రజా పాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సంయమనం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ నాయకుల్లా ప్రవర్తిస్తే తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలలో మీరు తిరగగలుగుతారా ఒకసారి ఆలోచించుకోండి అని హెచ్చరించారు. గత బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే ఇళ్లకు పరిమితం చేశామని గుర్తు చేశారు. మీ నాయకులు ప్రవర్తన మార్చుకోకపోతే మీకు కూడా అదే గతి పడుతుందని సూచించారు. ఈ సంఘటనలో రాష్ట్ర ప్రభుత్వం మరియు ఇంటెలిజెన్స్, పోలీస్ వ్యవస్థ విఫలమైన తీరు స్పష్టంగా కనిపిస్తుంది అని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ సంఘటనను సీరియస్ గా తీసుకొని దాడిలో పాల్గొన్న వ్యక్తులపై కేసు నమోదు చేసి వారిని శిక్షించాలని కోరారు.ఈ సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమక్షంలో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనియెడల బిజెపి శ్రేణులు ఉద్యమాన్ని ఉధృతం చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, కార్యకర్తలు శివశంకర్, చిరంజీవి, భూమేష్, అశ్విన్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india