V1News Telangana

best news portal development company in india

కాంగ్రెస్ నాయకుల దాడిని ఖండించిన బిజెపి శ్రేణులు….

SHARE:

– బిజెపి రాష్ట్ర కార్యాలయం పై దాడి హేహమైన చర్య

– విద్వేషాలను రెచ్చగొడుతూ చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు

– హోం శాఖ మంత్రి పదవి ముఖ్యమంత్రి ఆధీనంలోనే

– శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమైన హోం శాఖ

– చందూరి హన్మాండ్లు బీజేపీ కామారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి

కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: మంగళవారం రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువజన కాంగ్రెస్ నాయకులు బిజెపి రాష్ట్ర కార్యాలయం పై దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.. దీనిని ఖండిస్తూ బిజెపి కామారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి చందూరి హన్మండ్లు మాట్లాడారు. ఈ సంఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు స్పందించకపోవడం చాలా బాధాకరం అని అన్నారు. హోం శాఖ మంత్రిత్వ బాధ్యతలు ముఖ్యమంత్రి ఆధీనంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పూర్తిస్థాయిలో విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సంస్కారహీనులుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం పై ఇలాంటి దాడులు నిర్వహించడం సిగ్గుచేటు అని అన్నారు. విద్వేషాలను రెచ్చగొడుతూ చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ పాలన, ప్రజా పాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సంయమనం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ నాయకుల్లా ప్రవర్తిస్తే తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలలో మీరు తిరగగలుగుతారా ఒకసారి ఆలోచించుకోండి అని హెచ్చరించారు. గత బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే ఇళ్లకు పరిమితం చేశామని గుర్తు చేశారు. మీ నాయకులు ప్రవర్తన మార్చుకోకపోతే మీకు కూడా అదే గతి పడుతుందని సూచించారు. ఈ సంఘటనలో రాష్ట్ర ప్రభుత్వం మరియు ఇంటెలిజెన్స్, పోలీస్ వ్యవస్థ విఫలమైన తీరు స్పష్టంగా కనిపిస్తుంది అని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ సంఘటనను సీరియస్ గా తీసుకొని దాడిలో పాల్గొన్న వ్యక్తులపై కేసు నమోదు చేయాలని కోరారు.ఈ సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమక్షంలో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india