పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలకు హాజరైన మంత్రి….
– ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావ్
– తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలో మంగళవారం రోజు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావ్ పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఆయనకు పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద తెలంగాణ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నూతనంగా నిర్మించిన ఎక్సైజ్ శాఖ కార్యాలయ భవనాన్ని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు.

అదేవిధంగా బాన్సువాడ పట్టణంలో ప్రజల త్రాగునీటి అవసరాలు తీర్చేందుకు రూ .52 కోట్ల వ్యయంతో నిర్మించబోయే అమృత్ 2.0 త్రాగు నీటి పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావ్ మాట్లాడుతూ ఇల్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు . ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు మంజూరు చేస్తామన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి నాయకుడు బాన్సువాడ నియోజకవర్గానికి దొరకడం ఇక్కడి ప్రజలు చేసుకున్న అదృష్టం అన్నారు. 64 సంవత్సరాల రాజకీయంలో 15 మంది ముఖ్యమంత్రులు రూ . 65 వేల కోట్లు అప్పు చేస్తే.. గత పదేళ్లలో కేసీఆర్ రూ . ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేశారని మండిపడ్డారు.

తప్పు చెయ్యక పోతే కేటీఆర్ విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని అన్నారు.ఆ రోజు బంగారు పళ్ళెంలో పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అప్ప చెప్పామని హరీష్ రావ్ అన్నారని పేర్కొన్నారు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బంగారు పళ్ళెంలో ఏముందని చూస్తే “అప్పుల కుప్ప చేతికి చిప్ప” ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఈ నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా పరిపాలన చేస్తుందన్నారు. కెసిఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అత్త సొమ్ము అల్లుడు దానం చేచేసినట్లుగారైతు బందు పథకానికి సుమారు 24 వేల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఉన్నారు. ఆనాడు రైతుబంధు పథకం ద్వారా భూస్వాములకు, పంటలు పండని కొండలకు, గుట్టలకు ఆర్థిక సహాయం అందించారని తెలిపారు.అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టి గెలిపించారని అన్నారు. బిఆర్ఎస్ హయాంలో ప్రగతి భవన్ లో అడుగుపెట్టే పరిస్థితులు కూడా ఉండేవి కావని ..మంత్రులకు ఫాం హౌస్ కు వెళ్లి కలిసే పరిస్థితి కూడా ఉండేది కాదని ఆత్మాభిమానం చంపుకొని కలిసి ఉండడం ఇష్టం లేక బిఆర్ఎస్ పార్టీని వీడామని.. అందుకే కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచామని పేర్కొన్నారు.

కేసీఆర్ కు అతని కుటుంబానికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను ఆయన కోరారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బాన్సువాడ పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతుందని అమృత్ 2.0 పథకంతో పట్టణ ప్రజల నీటి సమస్య తీరుతుందన్నారు.కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు ఇస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం నిధులు మంజూరు చేశారని సంతోషం వ్యక్తం చేశారు.రూ. 37 కోట్లతో పట్టణంలో ఏరియా ఆసుపత్రి నిర్మించుకుంటున్నామన్నారు. దాదాపు రూ.1000 కోట్ల వ్యయంతో ఇరిగేషన్ పనులు సాగుతున్నాయని తెలిపారు. రోడ్లు కూడా బాగు చేసుకుంటున్నామని అన్నారు. నియోజక వర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే నా లక్ష్యం అని.. ప్రతి ఒక్క నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా చూస్తానని తెలిపారు. నియోజకవర్గంలో ఇల్లు లేని పేదవారు ఉండకూడదు అన్నారు .ఈ కార్యక్రమంలో ఎంపీ సురేష్ శెట్కార్ , జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావ్, తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్ రాజ్ , ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి, జిల్లా అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








