– NRI, కోనేరు ట్రస్ట్ అధినేత శశాంక్ సహకారంతో ఏర్పాటు
– పండగల యొక్క ప్రాధాన్యతను భావితరాలకు వివరించే ప్రయత్నం
– అంతరించిపోతున్న సాంప్రదాయాలను ప్రోత్సహించే క్రమంలో ముగ్గుల పోటీలు
– మహిళలు, బాలికలు అవకాశాన్ని వినియోగించుకొని ప్రతిభను కనబరచాలి
– బిజెపి నస్రుల్లాబాద్ మండల అధ్యక్షులు సున్నం సాయిలు
కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల రామాలయం ప్రాంగణంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని NRI , కోనేరు ట్రస్ట్ అధినేత శశాంక్ సహకారంతో ..జనవరి 9వ తేదీ గురువారం రోజు ఉదయం 10 గంటలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ముగ్గుల పోటీలు బిజెపి నసరుల్లాబాద్ మండల అధ్యక్షుడు సున్నం సాయిలు ఆధ్వర్యంలో జరుపబడతాయని సమావేశం అనంతరం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా సున్నం సాయిలు మాట్లాడుతూ మన పండగల యొక్క ప్రాధాన్యతను భావితరాలకు అందించడానికి.. అదేవిధంగా కనుమరుగైపోతున్న సంస్కృతి సంప్రదాయాలను ప్రోత్సహించడానికి ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు.ముగ్గుల పోటీలలో పాల్గొనే మహిళలు బుధవారం రోజు సాయంత్రంలోగా 8179216775,9618213030 ఇక్కడ చూపిన నెంబర్లకు ఫోన్ చేసి నమోదు చేసుకోవాలని తెలిపారు.

ముగ్గులు వేయడానికి సరిపడా రంగులు, ముగ్గు కమిటీ వారే అందిస్తారని తెలిపారు. చుక్కల ముగ్గులు మాత్రమే వెయ్యాలని నిబంధనలు సూచించారు. న్యాయ నిర్నేతల పర్యవేక్షణలోనే విజేతలను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ముగ్గుల పోటీలలో పాల్గొని గెలిచిన వారికి ప్రథమ నగదు బహుమతి రూ.2516 , ద్వితీయ నగదు బహుమతి రూ.1616, తృతీయ నగదు బహుమతి రూ.1116 ప్రధానం చేయబడతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమం ఓ బి సి జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్ల సతీష్, మండల ప్రధాన కార్యదర్శి మేకల రామన్న యాదవ్, మండల ఉపాధ్యక్షులు అనుసూరి శ్రీనివాస్ రావ్, మండల మహిళా అధ్యక్షురాలు కంది సావిత్రి, కిసాన్ మోర్చా అధ్యక్షులు జి. యాదగిరి గౌడ్, రామాలయ కమిటీ అధ్యక్షులు అరిగె నారాయణ, శక్తి కేంద్రం ఇంచార్జ్ పి. గంగాధర్ గుప్తా, బూత్ అధ్యక్షులు కంది పెద్ద మల్లేష్, ఉల్లెంగ గోపి అందరి సమక్షంలో గ్రామ పెద్దల సహకారంతో జరుగుతాయని తెలియజేశారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








