V1News Telangana

best news portal development company in india

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టైలు మరియు బెల్టులు విరాళం….

SHARE:

– టై మరియు బెల్టు ల దాతకు అభినందనలు

– అందరూ సేవా భావంతో విరాళాలు అందించాలి

– గ్రామ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు అవ్వాలి

– మాజీ ఎంపీపీ పాల్త్యా విట్టల్

బాన్సువాడ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని సంగం గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సోమవారం రోజు గ్రామానికి చెందిన కె .దశరథ్ సేవా దృక్పథంతో టైలు మరియు బెల్టులు విరాళం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎంపీపీ పాల్త్యా విట్టల్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన విద్యార్థులకు టైలు మరియు బెల్టులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చందు, ఉపాధ్యాయులు ,గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india