V1News Telangana

best news portal development company in india

“బెస్ట్ సర్వీస్ సొసైటీ”నేషనల్ అవార్డును అందుకున్న విద్యుత్ శాఖ ఉద్యోగి ….

SHARE:

– అసిస్టెంట్ లైన్ మెన్ మెర్గె భూమేష్

కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలో విద్యుత్ శాఖలో అసిస్టెంట్ లైన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న మెర్గె భూమేష్ విధి నిర్వహణలో ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తించి “బహుజన సాహిత్య అకాడమీ” వారి ఆధ్వర్యంలో జనవరి 5 వ తేదీన హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో నిర్వహించిన బహుజన సాహిత్య అకాడమీ 8 వ తెలంగాణ రాష్ట్ర కాన్ఫరెన్స్ లో బహుజన సాహిత్య అకాడమీ (BSA) జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు యం.గౌతమ్ మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు ముత్తెనపల్లి నాగరాజు చేతుల మీదుగా “బెస్ట్ సర్వీస్ సొసైటీ “నేషనల్ అవార్డును, ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ క్రమంలో వారు ఆయనను ఘనంగా సత్కరించి,అభినందించారు. భవిష్యత్తులో సమాజానికి మరింత సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా (BSA) జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ మాట్లాడుతూ బహుజనులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీల సాహిత్యాన్ని ముందుకు తీసుకువెళ్లడం కొరకు బహుజన సాహిత్య అకాడమీ వారు ప్రతి సంవత్సరం ప్రజా ఉద్యమకారులకు, సంఘసేవకులకు, కవులకు, రచయితలకు మరియు స్వచ్ఛంద సేవా సంస్థలకు వారి సేవలను గుర్తించి.. ప్రోత్సాహకంగా ఈ అవార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాల నుండి సుమారుగా 300 మంది డెలిగేట్స్ హాజరయ్యారని తెలియజేశారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india