V1News Telangana

best news portal development company in india

అభివృద్ధి పనులపై నిఘా పెంచిన ప్రియతమ నేత ….

SHARE:

అభివృద్ధి పనులపై నిఘా పెంచిన ప్రియతమ నేత ….

– 37.50 కోట్ల వ్యయంతో నిర్మించే ఏరియా ఆసుపత్రి పనుల పరిశీలన ..40 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బిఎస్సి నర్సింగ్ కళాశాల పనుల పరిశీలన ..పనుల పురోగతిపై గుత్తేదారులతో చర్చ, పలు సూచనలు ..మెరుగైన నాణ్యత ప్రమాణాలు, నిబంధనలు పాటించి నిర్మాణాలు చేపట్టాలని ఆదేశాలు.. తెలంగాణ వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి..

బాన్సువాడ పట్టణ కేంద్రంలో నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి రూ.37.50 కోట్లతో నూతనంగా నిర్మించే 100 పడకల ఏరియా ఆసుపత్రి భవన నిర్మాణ పనులను శనివారం రోజు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి సందర్శించి పరిశీలించారు.

ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిపై గుత్తేదారుతో చర్చించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన నాణ్యత ప్రమాణాలు, నిబంధనలు పాటించి భవన నిర్మాణం చేపట్టాలని వారికి సూచించారు. అనంతరం రూ. 40 కోట్లతో నసురుల్లాబాద్ మండలంలోని దుర్కి గ్రామ శివారులో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ బిఎస్సి నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. గుత్తే దారుతో చర్చించి పనుల పురోగతిపై ఆరా తీశారు. త్వరితగతిన పనులు పూర్తిచేసి భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఎజాస్, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india