V1News Telangana

best news portal development company in india

బీహార్ యూపీతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులకు పొట్ట గొడుతున్న బ్రోకర్లు ఒక ఎకరానికి వెయ్యి రూపాయల చొప్పున కమిషన్ 5 ఎకరాలకు గాను రోజుకు 5000 రూపాయలు ఆపై రూపాయలు దండుకోవడం

SHARE:

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో ప్రస్తుతం రబీ సీజన్లో నాట్లు సీజన్ ప్రారంభమైంది, చాలామంది బీహార్ యూపీ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికుల తో నాట్లు వేస్తున్నారు, బతుకు బండి జీవనాధారం కోసం ఎంతోమంది ఇతర రాష్ట్రం అయినా బీహార్ యూ పి మహారాష్ట్రకు చెందిన నాట్లు వేసే కూలీలు పలు గ్రామాలలో పలు మండలాల్లో కొంతమంది ఒకే రూమ్లో అద్దెకు ఉంటున్నారు,

ఇక్కడున్న కొంతమంది బ్రోకర్లు వారిని ఆశ్రయించి, కొన్ని వ్యవసాయ భూములకు సంబంధించిన రైతులతో మాట్లాడి వారి పొలాల్లో నాట్లు వేయడానికి ఒప్పందం కుదుర్చుకొని ఈ కార్మికులను నాట్లు వేయడానికి తీసుకువెళ్తున్నారు, ఈ విధంగా వచ్చిన కార్మికులకు రైతులతో ఎకరానికి 4200 నుంచి సుమారు 4500 వరకు గుత్తా ఇస్తున్నారు. బ్రోకర్లు మాత్రం రైలుతో మాట్లాడి ఈ కార్మికులు తీసుకొని నాటు వేసినందుకు గాను కమిషన్ సుమారు రోజుకు ఐదువేల రూపాయి నుంచి ఆపై రూపాయలు తీసుకుంటున్నారని విమర్శలు లేకపోలేదు, ఈ విధంగా వచ్చిన కార్మికులు రోజుకు 5 ఎకరాల చొప్పున నాట్లు వేస్తారని, 5 ఎకరాలపాటు నాటు వేసినందుకు సుమారు 5000 నుంచి ఆపై రూపాయలు కమిషన్ తీసుకుంటున్నారని విమర్శలు లేకపోలేదు, ఇక్కడున్న మధ్యవర్తిగా వచ్చిన బ్రోకర్లు , ఇతర బ్రోకర్లు మాత్రం ప్రతిరోజు 5000 నుంచి ఆ పై రూపాయలు కార్మికులను మోసం చేసి దండుకుంటున్నారని దీనిపై సంబంధిత శాఖ అధికారులు దృష్టి పెట్టి కార్మికులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india