V1News Telangana

best news portal development company in india

ప్రభుత్వ న్యాయవాదిగా పదవి బాధ్యతలు స్వీకరణ…..

SHARE:

– పేద ప్రజలకు సేవలు అందించడానికి తన వంతు కృషి చేస్తాను

– తన నియామకానికి సహకరించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు

– బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణమూర్తి

బాన్సువాడ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు లో ప్రభుత్వ న్యాయవాదిగా లక్ష్మీనారాయణ మూర్తి గురువారం రోజు పదవి బాధ్యతలు స్వీకరించారు. న్యాయమూర్తి టి ఎస్ పి భార్గవి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో పేద ప్రజలకు సేవలు అందించడానికి ప్రభుత్వ న్యాయవాదిగా నియామకానికి కృషి చేసిన వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాల్ రాజ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మరియు కోర్టు సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ క్రమంలో న్యాయవాదులు అందరూ కలిసి న్యాయమూర్తి టీఎస్పీ భార్గవిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రమాకాంత్, దత్తాత్రేయ, మొగులయ్య, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india