V1News Telangana

best news portal development company in india

మున్సిపల్ కార్మికులకు ఇవ్వాల్సిన నెల నెల సర్కులు ఎవరికి పోతుంది?  లక్షలు బిల్లులు పెడుతూ మోసం కార్మికులకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా అక్రమంగా తరలింపు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో బెల్లాన్ని అక్రమంగా తరలింపు ? బెల్లం తరలింపు పై అధికారుల చర్య ఉంటుందా ?

SHARE:

మున్సిపల్ కార్మికులకు ఇవ్వాల్సిన నెల నెల సర్కులు ఎవరికి పోతుంది?

లక్షలు బిల్లులు పెడుతూ మోసం కార్మికులకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా అక్రమంగా తరలింపు

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో బెల్లాన్ని అక్రమంగా తరలింపు ?

బెల్లం తరలింపు పై అధికారుల చర్య ఉంటుందా ?

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం డిసెంబర్ 31 :-

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో కొత్త రకమైన వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఐదు నెలల కిందట కార్మికులకు ఆరోగ్యరీత్యా పంచడానికి మున్సిపల్ అధికారులు బెల్లం కొనుగోలు చేసినారు. అయితే దానిని గుట్టుచప్పుడు కాకుండా ఆటోలో లోడ్ చేసి బయట వ్యక్తులకు అమ్ముతున్నట్లు విశ్వాసనీయమైన వర్గాల సమాచారం. రామగుండం మున్సిపల్ కార్మికులకు పంచల్సిన బెల్లాన్ని బయట వాళ్లకు ఎలా అమ్ముతున్నారనేది తీరుపై అనేక ప్రశ్నలు వెలువడుతున్నాయి. అలాగే నెల నెల కార్మికులకు పంచాల్సిన సబ్బులు ఇతర వస్తువులు ఇవ్వకుండా ఇస్తున్నట్లు రికార్డులను రాస్తూ లక్షల్లో బిల్లులు పెడుతూ ప్రభుత్వాన్ని అధికారులను మోసం చేస్తున్న తీరుపై అనేక ప్రశ్నలు వెలువడుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఈ సంఘటన ముక్కున వేలేసుకుంటున్న ప్రజానీకం. తెలియకుండా ఇంకెన్ని జరుగుతున్నాయని అనేక ప్రశ్నలు వెలువడుతున్నాయి. ఈ తీరుపై అధికారుల చర్య ఉంటుందా అనే ప్రశ్న కూడా వినిపిస్తున్నాయి. మున్సిపల్ పాలకవర్గంలో అధికారులు ఉన్నట్ల లేనట్ల మున్సిపల్ ఆఫీసు నుండి నేరుగా గుట్టు చప్పుడు కాకుండా బెల్లం ఆమ్మకం ఇంత జరుగుతున్న ఎవరు పట్టించుకోకపోవడం ఆశ్చర్యకరం. రామగుండం మున్సిపల్ కమిషనర్ గా పెద్ద స్థాయి అధికారులు ఉన్నప్పటికీ ఇలాంటి సంఘటనలు జరగడం పట్ల ముక్కున వేలేసుకుంటున్న ప్రజానీకం. రామగుండం పాలగోవర్గంలో కొరడా విధించే అధికారులే ఇనాయ దందాకు తరలింపడంపై ఆశ్చర్యకరం. దీనిపై అధికారులు విజిలెన్స్ అధికారులు స్పందించి సత్వరమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సంఘటనపై ఏ స్థాయిలో చర్య ఉంటుందో వేచి చూడాల్సిందే.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india