Post Views: 111
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలో శనివారం రోజు జిల్లా సామాజిక ఆశయ సాధన సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సందుల గంగారం చలికాలం కారణంగా చలి తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న వయవృద్ధులను మరియు రోడ్లపై బహిరంగంగా నిద్రిస్తున్న యాచకులను చూసి చలించిపోయి.. మానవతా దృక్పథంతో స్పందించి స్వచ్ఛందంగా పట్టణంలో గల వయోవృద్ధులకు మరియు యాచకులకు రగ్గులను జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంజిరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు మైసయ్య, సామాజిక ఆశయ సాధన సేవా సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ సాయిలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








