– సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశం
– జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం రోజు కలెక్టరేట్ లో పారిశుద్ధ్యం, త్రాగునీరు, ఇంటి పన్ను వసూళ్ళు, సీసీ చార్జీలు, భవన నిర్మాణాల అనుమతులు, ఇందిరమ్మ ఇండ్ల సర్వే, వన మహోత్సవం తదితర అంశాలపై సంబంధిత శాఖ అధికారులు ఎంపీడీవోలు, ఎంపీ ఓలు, మిషన్ భగీరథ ఇంజనీర్లు, గ్రామీణ అభివృద్ధి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల సర్వే వేగంగా ప్రణాళిక బద్ధంగా నిర్వహించాలని అన్నారు. గ్రామాలలో పారిశుద్ధ్యం మరియు త్రాగునీటి సరఫరా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటి పన్నులు క్రమం తప్పకుండా వసూలు చేయాలని తెలిపారు. ఎవరైనా అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు చేపట్టినట్లయితే ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








