V1News Telangana

best news portal development company in india

గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు కల్పించాలి……

SHARE:

– ఏళ్ల తరబడి గ్రామాలలో ప్రజలకు సేవలందిస్తున్న గ్రామపంచాయతీ సిబ్బంది

– కార్మికుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు

– పెండింగ్ లో ఉన్న వేతనాలను త్వరిత గతిన చెల్లించాలి

– కార్మికులు ఐకమత్యంగా ప్రభుత్వంతో పోరాడి డిమాండ్ లు సాధించుకోవాలి

– సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: జుక్కల్ మండల కేంద్రంలో గల ఎంపీడీవో కార్యాలయం ముందు శనివారం రోజు సిఐటియు ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామపంచాయతీల కార్మికులందరూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు” టోకెన్ సమ్మె” నిర్వహించారు. ఈ క్రమంలో వారు స్థానిక ఎంపీడీవోకు వినతి పత్రం అందించారు.ఈ సమ్మె కు మద్దతుగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరతరాలుగా గ్రామాలలో మరియు పట్టణాలలో పారిశుద్ధ్య సిబ్బంది మరియు వాటర్ మెన్ లు నిరంతరం ప్రజలకు సేవలందిస్తూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతూ.. వారు మాత్రం శ్రమకు తగిన ఫలితం పొందడం లేదని అన్నారు. గ్రామపంచాయతీ సిబ్బంది అంతలా పనిచేస్తూ ప్రజలకు సేవలందించినప్పటికీ ప్రభుత్వాలు వారిని చిన్నచూపు చూస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని..గ్రామపంచాయతీ కార్మికులందరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలని..అదేవిధంగా పెండింగ్ లో ఉన్న కార్మికుల వేతనాలను త్వరితగతిన విడుదల చేయాలని కోరారు. ప్రతినెల ఒకటవ తేదీన వేతనాలు నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాలలో కి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు మరియు ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కార్మికులందరూ తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేంతవరకు ఐకమత్యంతో ప్రభుత్వంతో పోరాడి డిమాండ్లు సాధించుకోవాలని గ్రామపంచాయతీ కార్మికులందరికీ ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎస్.అజయ్ కుమార్, గ్రామపంచాయతీ కార్మికుల మండల అధ్యక్షులు గోవింద్, మండల కార్యదర్శి వాగ్మరే సాయిలు,ఉపాధ్యక్షులు వీరన్న, కార్మికులు పండరి, నర్సింగ్, దవులయ్య, యాదవ్, సంజయ్,దేవదాస్, మేత్రి గంగారాం,మండలంలోని వివిధ గ్రామపంచాయతీల కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india