– భారతదేశం గొప్ప నేతను కోల్పోయింది
– ఎన్నో ఆర్థిక సంస్కరణలతో దేశాభివృద్ధిలో కీలక పాత్ర
– ఆర్బిఐ గవర్నర్ గా దేశానికి అందించిన ఎనలేని సేవలు
– శాంత స్వభావుడిగా, వివాదాలకు దూరంగా చేపట్టిన నాయకత్వం
– మాజీ AMC చైర్మన్ పెరిక శ్రీనివాస్ వ్యాఖ్యలు
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం రోజు భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు సంతాప సభ నిర్వహించారు. ఈ క్రమంలో వారు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు అందరూ కలిసి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

ఈ సందర్భంగా మాజీ ఏఎంసీ చైర్మన్ పెరిక శ్రీనివాస్ మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ రెండు పర్యాయాలు దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారని అన్నారు. ఆయన ఎన్నో ఆర్థిక సంస్కరణలు రూపొందించి భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడపడంలో కీలక పాత్ర పోషించారు అన్నారు. అదేవిధంగా ఆయన మృదుస్వభావి అని.. వివాదాలకు దూరంగా ఉంటూ నాయకత్వాన్ని కొనసాగించే వారిని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటు స్వతంత్రంగా జీవించడానికి .. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంలో ఆయన పాత్ర గొప్పదని అభివర్ణించారు. అంత గొప్ప నాయకుడిని కోల్పోయినందుకు బాధగా ఉందని అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండలాల AMC చైర్మన్ దుర్గం శ్యామల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ పాల్త్య విటల్, మాజీ జెడ్పిటిసి జన్ను బాయ్ ప్రతాప్ సింగ్, మాజీ ఎంపీటీసీ కంది మల్లేష్,PACS వైస్ చైర్మన్ బొబ్బిలి గంగారాం, మాజీ సర్పంచ్ వనం వెంకటేశ్వరరావు ,మాజీ ఉపసర్పంచ్ ఖలీల్, నాయకులు దంతూరి మైషా గౌడ్, యూసుఫ్, మంతపురి రామా గౌడ్, మామిడి భూమయ్య, ఫయాజ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








