V1News Telangana

best news portal development company in india

దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన గొప్ప నేత మన్మోహన్ సింగ్…

SHARE:

– పేద కుటుంబంలో జన్మించి తన మేధాసంపతితో ఉన్నత శిఖరాలకు ఎదిగిన వ్యక్తి

– రెండు పర్యాయాలు పూర్తి కాలం దేశానికి ప్రధానిగా పదవి బాధ్యతల నిర్వహణ

– రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా అందించిన సేవలు

– మృదుస్వభావి, వివాద రహితులుగా నాయకత్వం

– తెలంగాణ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలో శుక్రవారం రోజు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ పేద కుటుంబంలో జన్మించినప్పటికీ తన మేధా సంపతితో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించారని కొనియాడారు. ఎన్నో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన గొప్ప ఆర్థికవేత్త అని అభివర్ణించారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా కూడా విధులు నిర్వహించారని గుర్తు చేశారు. గొప్ప నాయకత్వ లక్షణాలతో రాజకీయ పార్టీల మన్ననలు పొంది కాంగ్రెస్ పార్టీ తరపున భారత దేశ ప్రజలకు రెండు పర్యాయాలు పూర్తి కాలం 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఎనలేని సేవలను అందించారని కీర్తించారు. ఆయన మృదు స్వభావి, వివాదా రహితుడు.. నిజాయితీగల వ్యక్తి అని ప్రతి ఒక్కరూ అతన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు అంజిరెడ్డి, ఎజాజ్, కృష్ణారెడ్డి, మోహన్ నాయక్, గోపాల్ రెడ్డి, ఖాలేక్, గంగారాం, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india