Post Views: 110
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 17వ రోజుకు చేరుకుంది. గురువారం రోజు కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్యోగులు రోడ్లు ఊడుస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సంపత్, మహిళా అధ్యక్షురాలు వాసంతి, నాయకులు రాములు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








