– ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో సమావేశం
– నిజామాబాద్ గంగాస్థాన్ లోని ఆమె సొంత నివాసంలో ఏర్పాటు
– భవిష్యత్ కార్య చరణ పై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం
– యువజన నాయకుడు అఫ్రోజ్
V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు.. నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో బాన్సువాడ నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలందరితో ఈనెల 30వ తేదీన నిజామాబాద్ గంగాస్థాన్ లో గల తమ స్వగృహంలో ఉదయం 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేయనున్నారని బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు అఫ్రోజ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 30వ తేదీ న ఉదయం 9 గంటలకు బాన్సువాడలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ ఇంటి వద్ద నుండి ర్యాలీ నిర్వహించి బయలుదేరి నిజామాబాద్ వెళ్లాలని సూచించారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలో గల బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








