V1News Telangana

best news portal development company in india

ప్రభుత్వ పనితీరుపై మండి పడిన ఎమ్మెల్సీ కవిత……

SHARE:

– ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం పై అబండాలు మోపిన రేవంత్ రెడ్డి

– అధికారంలోకి వస్తే మాఫీ చేస్తామని ఇచ్చిన హామీ

– భూమిని నమ్ముకుని బ్రతుకు వెల్ల తీస్తున్న రైతులు

– రైతుల భూములు వేలానికి పెడితే సహించేది లేదు

– బ్యాంకు అధికారులు భూములు వేలం వేస్తుంటే స్పందించని ప్రజా నాయకుడు

– ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలో గల మైలారం, దుర్కి, మిర్జాపూర్, నసరుల్లాబాద్, నాచుపల్లి గ్రామాలలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలలో రుణాలు తీసుకుని దీర్ఘకాలంగా చెల్లించని రైతుల భూములను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బ్యాంకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీలు చేసి అన్నదాతకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం రైతుల భూములు బ్యాంకు అధికారులు బహిరంగంగా వేలం వేస్తుంటే ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని మండిపడ్డారు. అంకోల్ తండాలో రైతుల భూములు వేలం పాట నిర్వహించడం వలన రైతులు గుండెలవిసేలా రోదిస్తున్నారన్నారు. రైతుల భూములు వేలానికి పెడితే సహించేది లేదని హెచ్చరించారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india