V1News Telangana

best news portal development company in india

ముఖ్యమంత్రిని కలిసిన ఎంపి అరవింద్…..

SHARE:

V1 న్యూస్ నిజామాబాద్ ప్రతినిధి:

నిజామాబాద్ జిల్లా:నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆదివారం రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ నిజామాబాద్ మరియు జగిత్యాల జిల్లాల్లో నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు స్థలాలు కేటాయించాలని తెలిపారు. అదేవిధంగా ఆర్ఓబి నిర్మాణాల పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని, జక్రాన్ పల్లి ఎయిర్ పోర్ట్ ఓఎల్ఎస్ సర్వే త్వరితగతిన నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ విషయాలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలియజేశారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india