V1News Telangana

best news portal development company in india

గొప్ప మనసు చాట్టుకున్న పూర్వ విద్యార్థులు…..

SHARE:

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలో గల నవోదయ విద్యాలయంలో 8వ బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థులు దాదాపు రూ.3 లక్షల వ్యయంతో విద్యాలయంలో సోషల్ పార్క్ ను ఏర్పాటు చేయించారు. పార్కులో జాతీయ చిహ్నం, జాతీయ నేతల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆదివారం రోజు పూర్వం పనిచేసిన ప్రిన్సిపాల్ సత్యవతి రాథోడ్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేయించి ప్రారంభింపజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నవోదయ విద్యాలయంలో క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు ఎదిగిన పూర్వ విద్యార్థులకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా చదువుకున్న విద్యాలయానికి ఏదో ఒకటి తమ వంతుగా చేయాలని తపనతో పార్కును ఏర్పాటు చేయడం గొప్ప విషయమని కొనియాడారు. అనంతరం పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. పూర్వ విద్యార్థులు విద్యార్థి దశలో తాము ఎదుర్కొన్న అనుభవాలను తీపి జ్ఞాపకాలను పరస్పరం గుర్తు చేసుకుని పంచుకున్నారు. పార్క్ ను ఏర్పాటు చేయడం పట్ల పలువురు పూర్వ విద్యార్థులను అభినందించారు. సమాజంలో అందరూ ఇలా గొప్పగా ఆలోచించి సేవా కార్యక్రమాలను నిర్వహించాలని తెలియజేశారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india