– పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన చేసిన మంత్రి
– నెల రోజుల్లో వైద్య ,ఆరోగ్య శాఖకు సంబంధించి ప్రజలకు పూర్తి సౌకర్యాలు కల్పిస్తాం
– ఆసుపత్రిలో 25 శాతం వైద్యులు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి
– వైద్య ,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
V1 న్యూస్ నిజామాబాద్ ప్రతినిధి:
నిజామాబాద్ జిల్లా: పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నిజామాబాద్ జిల్లాకు ఆదివారం రోజు విచ్చేశారు. జిజిహెచ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజుల్లో వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి పూర్తి సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించడం ప్రభుత్వ లక్ష్యం మరియు బాధ్యత అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆసుపత్రిలో 25% మంది వైద్యులు సిబ్బంది ఎల్లప్పుడు చికిత్స పొందే వారికి అందుబాటులో ఉండాలని.. ఆ దిశగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జనరల్ ఆసుపత్రిలో సివిల్ పనుల కొరకు రూ.7 కోట్లు నిధులు కేటాయించామని తెలిపారు. వాటిని త్వరలోనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఉగాది లోపు పనులన్నీ పూర్తి చేయాలని జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అవసరము ఉంటాయో.. ప్రభుత్వం దృష్టికి తెచ్చినట్లయితే అక్కడ తప్పకుండా నెలకొలుపుతామని ఈ సందర్భంగా తెలిపారు.
జనాభా ప్రాతిపదిక ప్రకారం గ్రామీణ స్థాయిలో సబ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని.. రాష్ట్రంలో ట్రామా సెంటర్లను ఏర్పాటు చేస్తామని.. ప్రత్యేకంగా నిజామాబాద్ లో క్యాన్సర్ సెంటర్ ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణ, డాక్టర్ భూపతి రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి,నూడా చైర్మన్ కేశవేణు, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








